Thursday, July 15, 2010

ఛేదిస్తే వరల్డ్‌ రికార్డు


ఆస్ట్రేలియా, పాకిస్తాన్‌ మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్‌ భాగంగా తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌ గెలుపొందేందుకు 326 పరుగుల దూరంలో ఉంది. ఆస్ట్రేలియా చేసిన 440 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదిస్తే వరల్డ్‌ రికార్డు కూడా సొంతం చేసుకుంటుంది. తొలి ఇన్నింగ్స్‌లో 105 పరుగుల ఆధిక్యత సంపాదించిన ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో 334 పరుగులు చేసింది. 1994లో ఆసీస్‌పై ఆంటిగ్వాలో వెస్టిండీస్‌ నాల్గవ ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్ల నష్టానికి 418 పరుగులు చేసి విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో 80 పరుగులు చేసిన సైమన్‌ కటిచ్‌ రెండో ఇన్నింగ్స్‌లోనూ అదే స్థాయిలో ఆడాడు. అయితే ఈ ఇన్నింగ్స్‌ లో కూడా సెంచరీ చేసే అవకాశం చేజార్చుకున్నాడు. ఐదు వికెట్ల నష్టానికి 167 పరుగుల స్కోరుతో గురువారం ఆట ప్రారంభించిన ఆసీస్‌ను ఉమర్‌ గుల్‌ అసిఫ్‌ దెబ్బతీసారు. కటిచ్‌ 83 పరు గులు చేసి ఉమర్‌ గుల్‌ బౌలింగ్‌లో అవు టయ్యాడు. నార్త్‌ 20 పరుగులు చేసి అసిఫ్‌ బౌలింగ్‌లో అక్మన్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. స్మిత్‌ అవుటయ్యే సమయానికి ఆసీస్‌ స్కోరు ఎనిమిది వికెట్ల నష్టానికి 208 పరుగులు. ఈ దశలో పెయిన్‌ (47), హిల్ఫెన్హాస్‌ తొమ్మిదో వికెట్‌కు 74 పరుగులు జోడించడంతో ఆసీస్‌ కోలుకుంది. పెయిన్‌ అవుటైన తరువాత కూడా ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌ పాక్‌ బౌలర్లను ప్రతిఘటించారు.

No comments: