Sunday, December 19, 2010

క్రికెట్‌ ధీరుడు - సెంచరీల శూరుడు


సచిన్‌ ఈ పేరంటే క్రికెట్‌లో రికార్డులకు మారుపేరు.. తన క్రికెట్‌ కెరీర్‌లో ఎన్నో రికార్డులను అధిగమించి... సరికొత్త రికార్డులను సృష్టించి... ఎవ్వరూ చేరపలేని రికార్డులను సైతం ప్రతిష్టింపచేశాడు. అలాంటి మన సచిన్‌ దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా జరిగిన టెస్టు సిరీస్‌లో మొదటి మ్యాచ్‌ నాలుగో రోజు ఈ మధ్య అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టెస్టుల్లో 50వ సెంచరీని కాస్తా పూర్తి చేశాడు. ఈ సెంచరీకి ఇక విశిష్టత కూడా ఉంది. అందేంటంటే మొదటి ఇన్నింగ్స్‌లో చిత్తయిన భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో కాస్త తెరుకున్నట్టు కనిపించినా మళ్లీ దక్షిణాఫ్రికా దాటికి టాప్‌ ఆర్డర్స్‌ చేతులెత్తేసారు. ఈ క్లిష్ట సమయంలో సచిన్‌ 50వ సెంచరీకి కాకుండా టీమ్‌ను ఓటమి నుండి గట్టేక్కించాలని తన వంతు సహాయాన్ని చేశాడు. ధోనీతో కలిసి మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పి టీమ్‌లో కొంత ఉత్సాహాన్ని నింపాడు. అయిన ఇంకా ఓటమి నుండి తప్పించుకోవాలంటే ఐదోరోజు కూడా ఆడాలి. సచిన్‌కు సహాకారం అందించాడానికి ఎవ్వరూ లేరు కాబట్టి భారత్‌కు ఓటమి తప్పేట్లు లేదు. కాబట్టి ఇంకా 30 పరుగులు చేస్తే ఇన్నింగ్స్‌ ఓటమి తప్పుతుంది. అదన్న నేరవేరుతుందో చూద్దాం. భారత్‌ ఇప్పుడు సచిన్‌, మిగతా శ్రీశాంత్‌, ఉనాద్‌ల మీద ఆశలు పెట్టుకోకుండా వరణుడిని వేడుకొంటే భారత్‌ ఓటమి నుండి బయటపడోచ్చేమో....
ఏదీ ఏమైనప్పటికీ మొత్తం మీద మన సచిన్‌ 50 సెంచరీ పూర్తి చేసి రికార్డును సృష్టించడంతో ఓటమిని కొంత మరచిపోయినట్లవుతుంది..
ఎవ్వరూ చేరుకోలేని రికార్డును సృష్టించిన సచిన్‌కు ఇవే నా వేల వేల వందనాలు............