
సంచలన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్ ర్యాంక్ సాధించాలనే ఆకాంక్షను నెరవేర్చుకునేందుకు ఇంకా ఒక్క మెట్టు దూరంలో ఉంది. తాజాగా ప్రకటించిన ఆమె అంతర్జాతీయ ర్యాంక్స్‌ల్లో నెంబర్ టు స్థానానికి చేరుకుంది. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య గురువారం నాడు ఈ ర్యాంక్‌లను విడుదల చేసింది. క్రీడల్లో ఏ విభాగంలోనైనా ప్రపంచ నెంబర్ టు ర్యాంక్ స్థానానికి చేరుకున్న భారత దేశానికి చెందిన క్రీడాకారిణిగా సైనా నెహ్వాల్ ఘనత సాధించింది. ఇంతకుముందు కోనేరు హంపి చెస్‌లో ఈ ఘనత సాధించింది. నెంబర్ టు ర్యాంక్ సాధించడం హర్షణీయమే అయినప్పటికీ ఉన్నత స్థానంలో నిలకడగా రాణిస్తున్న ఫలితమే ఈ ర్యాంక్‌లని సైనా వ్యాఖ్యానించింది. తనపై బాధ్యత మరింత పెరిగిందని పేర్కొంది. ర్యాంక్‌లను నిలబెట్టుకోవడం కష్టమనే విషయం తనకు తెలుసునని, మరిన్ని టైటిల్స్ గెలుచుకుని త్వరలోనే నెంబర్ వన్‌కు ఎదగగలననే నమ్మకం తనకుందని పేర్కొంది.
No comments:
Post a Comment